విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

-

ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని.. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం అన్నారు. నాణ్యమైన విద్య అన్నది హక్కు… ఇది కొత్త నినాదమని చెప్పారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే… మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని…ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ అన్నారు.

AP Govt signs key agreement with education portal Edx

ప్రపంచంతో మనం పోటీపడుతున్నామని..మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. మంచి మంచి జీతాలు సంపాదించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం.విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని…అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమేనని..ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చన్నారు. కాని ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిన అవసరం ఉందని వివరించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news