నేడు అసెంబ్లీలో సాగునీటి శాఖపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చ పెట్టాలని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. కాలేశ్వరంలో అవినీతిపై కాగ్ నివేదిక, మేడిగడ్డ సహా వివిధ ప్రాజెక్టుల్లో నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మద్యంతర నివేదికను శ్వేత పత్రంలో పొందుపరిచి..ఆ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్.
ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు ఉన్నాయని బాంబ్ పేల్చారు ఉత్తమ్. అన్నారంలో కూడా నిన్నటి నుంచి లీకేజీలు పెరిగాయని.. కట్టిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి మాపై ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహించారు. అన్నారంకు ndsa వాళ్ళు రెండు రోజుల్లో వస్తారన్నారు. అన్నారంలో లీకేజీ లు నిన్నటి నుండి పెరిగింది…అన్నారం లో కూడా క్రాక్స్ ఉన్నాయని చెప్పారు. మేడిగడ్డ లెక్కనే.. అన్నారం ప్రమాదంలో ఉందని ndsa చెప్పిందన్నారు ఉత్తమ్.