ఏపీ కి కేంద్రం గుడ్ న్యూస్.. రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు జాతికి అంకితం

-

ఎన్నికలవేళ ఆంధ్ర ప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ని నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తిరుపతి ఐఐటి ఐఐఎం విశాఖ ప్రాజెక్టులను ఈనెల 20న నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ రెండు విద్యారంగానికి సంబంధించిన కావడం విశేషం. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఎడ్యుకేషన్ హబ్ గా గుర్తింపు తెచ్చుకునే ఆస్కారం ఉంది. రాష్ట్రంలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ కేంద్రము గుడ్ న్యూస్ ప్రకటించడంతోపాటు రాష్ట్ర బిజెపి నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాతమని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news