జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం సభలనుద్దేశించి యుద్ధానికి సిద్ధం అని పేర్కొన్నారు. 24 సీట్లతో యుద్ధం చేస్తావా..? పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తోంది. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కి లేవు.
పవన్ పోటీ చేసే స్థానంపై ఆయనకే క్లారిటీ లేదు. జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారు. పవన్ ని అభిమానించే వారందరూ ఆలోచించుకోవాలి. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరు.. పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవీ తీసుకుంటే బాగుంటుంది. 24 మందితో వైసీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా..? అని ప్రశ్నించారు. 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో చెప్పలేదన్నారు.