ఈరోజు తెలంగాణ భవన్‌కు రానున్నారు గులాబీ బాస్, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సీఎం కేసీఆర్. ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీచేస్తే బాగుంటుందనే అంశంపై నేతలనుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌నేత పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరడంతో ఈ రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు బలంగా వినిపిస్తోంది.