కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అని సెటైర్లు వేసిన మంత్రి కోమటిరెడ్డి

-

వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రం నుంచి బీజేపీ,బీఆర్ఎస్ కనుమరుగవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు.ఇవాళ ఆయన నల్లగొండలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ…. తాము 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని వెల్లడించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకని కోమటి రెడ్డి సెటైర్లు వేశారు. అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడని.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ పోటీయే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చితుంటే ప్రతిపక్ష పార్టీ లకు ఏమాత్రం మింగుడుపడడం లేదని అన్నారు.ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తాము 90 రోజులలోపే అమలు చేస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. అదేవిధంగా ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నామని ,ఒక ఇంటికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టి స్థలం ఉన్నా లేకపోయిన నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news