చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన సీఎం జగన్..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు. కొంత మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరితే.. మరికొందరూ వైసీపీ నుంచి జనసేనలో.. ఇంకొందరూ జనసేన నుంచి వైసీపీలో ఇలా రకరకాలుగా పార్టీలను మారుతున్నారు.

ఇలా పార్టీలు మారుతున్న తరుణంలోనే ఏపీ సీఎం జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్‌ను కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీనివాసులుని సస్పెండ్ చేశారు. దీంతో జనసేన తరుపున శ్రీనివాసులు బరిలో నిలబడనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news