Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)..మరోసారి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు. ఇవాళ ఢిల్లీకి (Delhi) సీఎం రేవంత్ రెడ్డి..వెళ్లనున్నారు. ఇవాళ ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 10 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇక రేపు మరోసారి పయనం కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటన పై ప్రతి పక్షాలు గుర్రుగా ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా…ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు… ప్రజా ధనం ఎందుకు వృధా చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నాయి ప్రతి పక్షాలు. అయితే…మొన్న ప్రధాని మోడీతో సాన్నిహిత్యంగా ఉండటంపై కాంగ్రెస్ సీరియస్ అయిందని అంటున్నారు కొంత మంది. అందుకే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం పేరుతో రేవంత్‌ను రప్పిస్తున్నారనిస సమాచారం.