టీఎస్ఆర్టిసి ఉద్యోగులు ఆర్టీసీకి రథచక్రాలని త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులను అందిస్తామని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను కొనియాడారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ కృషి చేసిందని పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
మహాలక్ష్మి పథకంలో మహిళలకు జీరో టికెట్ ద్వారా ఆర్టీసీకి ఎలాంటి నష్టం కూడా రాదని వాటిని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు పొన్నం. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సేవలను గుర్తిస్తుందని త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉత్తమ అవార్డులను అందిస్తామన్నారు. పథకం ద్వారా 24 కోట్ల మహిళలు ప్రయాణించారని అందుకు సంతోషంగా ఉందని అన్నారు పొన్నం. మహిళలకి ఫ్రీ బస్సు సదుపాయం అందిస్తున్నామని ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తూ అనతి కాలంలోనే ప్రజలు మనల్ని పొందినన్నారు ప్రభాకర్.