నక్సలైట్ల పేరుతో 17 మంది గ్రామస్తులను చంపేశారు…? సాక్ష్యాలు బయటకు…!

-

అది ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా సర్కేగూడ గ్రామం… 2012 జూన్‌ 28 రాత్రి సర్కేగూడ గ్రామస్థులు ‘బీజ్‌ పందుమ్‌’ పండగ గురించి చర్చించడానికి గాను అందరూ ఒక చోట సమావేశం నిర్వహించారు. ఉన్నట్టుండి బలగాలు కాల్పులు జరిపాయి… ఈ కాల్పుల్లో 17 మంది గ్రామస్తులు మరణించారు… గ్రామస్తులను ఎందుకు చంపారు అంటారా…? దీనికి భద్రతా బలగాలు చెప్పిన దాని ప్రకారం మీడియా అల్లిన కథ… బీజాపూర్ జిల్లాలో సమావేశం నిర్వహిస్తున్న మావోయిస్ట్ లపై కాల్పులు… 17 మంది మావోలు హతం…

సరిగా ఏడేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా అనేక అనుమానాలకు వేదికగా మారింది. దీనితో రమణ సింగ్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటి వేసింది… అప్పటి నుంచి ఈ కమిటి నిజా నిజాలు తేల్చే పని లో భాగంగా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపింది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దానికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇది మీడియాకు లీక్ అయింది… దీనితో అసలు విషయం బయటపడింది. జస్టిస్‌ వీకే అగర్వాల్‌ నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ వాస్తవాలు బయటపెట్టింది. మావోలతో గ్రామస్తులు సమాచారం రావడంతో… గ్రామానికి చేరుకున్న భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 17 మంది మరణించారు… వాళ్ళు తమపై కాల్పులు జరిపారని అందుకే ఎదురు కాల్పులు జరిపామని అప్పుడు చెప్పారు. దీనిపై విచారణ జరపగా… వాళ్ళ వద్ద ఆయుధాలు ఉన్నట్టు ఒక్క ఆధారం కూడా భద్రతా బలగాల వద్ద లేదని… అసలు వారు మావోలు అని చెప్పడానికి కూడా బలగాల వద్ద ఒక్క సాక్ష్యం కూడా లేదని, వాళ్ళను కావాలనే దగ్గరి నుంచి కాల్చి చంపారు అని విచారణలో వెల్లడైంది. ఒకవేళ గ్రామస్థులు కాల్పులు జరిపి ఉంటే అక్కడే ఉన్న డీఐజీ, డిప్యూటీ కమాండెంట్‌ ఏదొకటి చెప్పే వారని కాని ఏ మాత్రం వారి నుంచి స్పందన లేదని ఇది కచ్చితంగా కావాలని చేసిందని నివేదికలో పేర్కొన్నారు. కాగా ఆ రాష్ట్రంలో గిరిజనులపై భద్రతా బలగాలు అకృత్యాలకు పాల్పడుతున్నాయి అనే విమర్శలు కొంత కాలంగా వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news