ఆ సినిమా కోసం వెంకీ – రానా కాంబో సెట్ అయిందా….??

-

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ అనే సినిమాలో తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా అనంతరం వెంకటేష్ అతి త్వరలో తమిళ మూవీ అసురన్ రీమేక్ లో నటించబోతున్న విషయం తెలిసిందే.

ధనుష్ హీరోగా వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్, ఎమోషనల్ మూవీని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ మరియు వి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మించబోతున్నట్లు ఇటీవల నిర్మాతల నుండి అధికారిక ప్రకటన రావడం జరిగింది. తెలుగులో ఈ సినిమాకు బ్రహ్మోత్సవం సినిమా ఫేమ్ శ్రీకాంత అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.

అదేమిటంటే, ఈ సినిమాలో మధ్య వయసున్న వ్యక్తిగా వెంకటేష్ నటిస్తుండగా, అదే క్యారెక్టర్ యక్త వయసులో ఉన్న సమయంలో రానా చేత చేయించడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అయినట్లు సమాచారం. అయితే తమిళ్ లో మాత్రం రెండు పాత్రలు ధనుష్ పోషించగా, తెలుగులో యుక్త వయసులో ఉండే క్యారెక్టర్ ను మరొక హీరోతో చేయిస్తే బెటర్ అని హీరో వెంకటేష్ తో సహా సినిమా యూనిట్ అనుకుంటున్నారట. అయితే ఆ క్యారెక్టర్ లోని ఫీల్ ని బట్టి రానా అయితేనే దానిని బాగా పోషించగలడని భావించి, అతడిని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది….!!

Read more RELATED
Recommended to you

Latest news