తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్నో తేల్చి చెప్పిన డీకే అరుణ

-

తెలంగాణలో గతం కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. నాలుగు సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతో పాటు మరికొన్ని కోట్ల కాషాయ జెండా ఎగరేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. బీజేపీ హై కమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా వంటి నేతలు తెలంగాణలో వరుస పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ గెలవబోయే ఎంపీ స్థానాలపై ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలువబోతుందని ఆమె జోస్యం చెప్పారు. రామ రాజ్యం తెచ్చిన ప్రధాని మోడీని గెలిపిస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news