తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతోంది. బీఆర్ఎస్ హయాంలో దొర్లిన తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగకూడదనే ఉద్దేశంతో TSPSC ని ప్రక్షాళన చేసింది. ఆ తరువాత గ్రూపు 1 కి కొన్ని పోస్టులను యాడ్ చేసింది. ఇలా కీలక మార్పులు చేస్తోంది.
నిరుద్యోగుల ఆశలు చిగురించే విధంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు TSPSC కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఏయే కేటగిరిల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయో చూసి వానికి భర్తీకి ఏ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వొచ్చు అనే దానిపై స్పష్టత ఇవ్వనుంది. అంతే కాకుండా టీఎస్పీఎస్సీ అర్హత పరీక్షల నిర్వహణ వంటి పూర్తి స్థాయి సమాచారంతో TSPSC నమూనా జాబ్ క్యాలెండర్ ను రూపోందించనుంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది.