అంగన్‌వాడీ బడుల్లో, మధ్యాహ్నభోజనంలో మోసం చేసే విధానం ఇది… అదో అరాచకం…!

-

ప్రభుత్వ బడుల్లో ఆహార నాణ్యత గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే… ప్రభుత్వాల నుంచి సమృద్దిగా నిధులు ఉన్నా సరే వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. టీచర్లు, వంట వాళ్ళు కలిసి ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. వాళ్ళు కక్కుర్తి పడి పిల్లలకు నాణ్యమైన భోజనం కూడా అందించడం లేదు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని చర్యలు తీసుకున్నా సరే మార్పు మాత్రం రావడం లేదు. ఈ అరాచకం రోజు రోజుకి పెరుగుతుంది గాని తగ్గే మార్గం మాత్రం ఎక్కడా కనపడటం లేదు అనేది వాస్తవం.

అసలు అంగన్‌వాడీ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ లో మోసాలు ఏ విధంగా చేస్తారు అంటే… ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలకు నాణ్యమైన బియ్యమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి… అయితే ఈ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నారు. ఉదాహరణకు 25 కేజీల బియ్యం స్కూల్ కి వినియోగిస్తే… రూపాయికి వచ్చే రేషన్ బియ్యం ని కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ బియ్యం బయట విక్రయిస్తూ ఉంటారు. ఇక కందిపప్పు విషయానికి వస్తే… ప్రభుత్వాలు నాణ్యమైనదే అందిస్తున్నాయి. బయటి మార్కెట్ లో లభించే నాసి రకం కందిపప్పుని…

తక్కువకు కొనుగోలు చేసి… ప్రభుత్వం నుంచి వచ్చే కందిపప్పుని బయట మార్కెట్ లో 20, 30 రూపాయలకు ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఇక పాల విషయంలో కూడా అంతే… రెండో రకం కొనడం అందులో నీళ్ళు కలిపి పొయ్యడం వంటివి చేస్తున్నారు. టీచర్లు, వంట వాళ్ళు ఒక్కటి అయి ప్రతీ నెలా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇక కోడి గుడ్ల విషయంలో అయితే దోపిడి అంతా ఇంతా కాదు… ప్రభుత్వ స్కూల్స్ లో హాజరు శాతం తక్కువగా ఉంటుంది… ఉదాహరణకు వంద మంది విద్యార్ధులు ఉంటే…

110 గుడ్లు కొనుగోలు చేస్తారు… హాజరు 40 నుంచి 50 లోపే ఉంటుంది. మిగిలిన వాటిని విక్రయిస్తూ ఉంటారు. కూరగాయలు, ఇతర సరుకుల్లో కూడా ప్రభుత్వ స్కూల్స్ లో కనపడని దోపిడి జరుగుతుంది. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే… మార్పు రావడం లేదు అనేది వాస్తవం. కొన్ని కొన్ని చోట్ల అయితే టీచర్లు మధ్యాహ్న భోజనంతోనే తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పిల్లలకు పెట్టె ఆహారంలో కూడా ఈ విధమైన కక్కుర్తి ఆందోళన కరం.

Read more RELATED
Recommended to you

Latest news