అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చి వాదన నిజాలనుమార్చదు: చైనాకు భారత్‌ కౌంటర్

-

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై చైనా అక్కసు వెళ్లగక్కింది. జాంగ్నన్ ప్రాంతం తమ భూభాగమని పేర్కొంది. అక్కడ భారత్ వేస్తున్న అడుగులు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని నోరుపారేసుకుంది.

ఈ నేపథ్యంలో డ్రాగన్ వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని చైనాకు చాలా సార్లు స్పష్టంగా చెప్పామని, డ్రాగన్ పిచ్చివాదన వాస్తవాలను మార్చలేదంటూ భారత విదేశాంగ శాఖ చైనాకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ‘‘ప్రధాని మోదీ అరుణాచల్‌ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్‌లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ మా నేతలు పర్యటనలు చేపడుతారు. ఈ పర్యటనలను వ్యతిరేకించడం, భారత అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కాదు.’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news