సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయినాయి.ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాము అమలును సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులను 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6బీ ప్రకారం స్వీకరించొద్దని కోరారు. ప్రభుత్వం అఫ్గాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం ఇవ్వొచ్చు కానీ మతం ఆధారంగా ఇవ్వకూడదని ఒవైసీ ఇటీవల సూచించారు. కాగా, ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.