రామ్ చరణ్ ,చిరంజీవి కాంబో లో రానున్న మరో మూవీ డైరెక్టర్ ఎవరంటే..?

-

సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా డు. చిరంజీవి దాదాపు 40 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సంచలనాలను సృష్టించాడు. సినిమా ఇండస్ట్రీలో అప్పటినుంచి ఇప్పటివరకుఎవ్వరికి సాధ్యం కానీ రీతి లో మెగాస్టార్ గా తనకంటూ ఉన్న పేరు ను కాపాడుకుంటూ వస్తున్నాడు.

 

ఇక మెగాస్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం స్టార్ ముందుకు సాగుతున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా వచ్చింది. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో అభిమానుల కోరిక మేరకు వీళ్లిద్దరు కాంబినేషన్లో మరొక మల్టీ స్టార్ మూవీ రాబోతుందట. ఈ సినిమా ను మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా అభిమానులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.ఇదిలా ఉంటే… మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ తో పాటు మరొక్క సినిమాని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news