బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభించింది: ప్రధాని నరేంద్ర మోడీ

-

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘నిన్ననే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. ఆ వెంటనే ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చాను అని తెలిపారు. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావిస్తున్నా ఆయన పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు..ఎన్డీఏకి 400 సీట్లు దాటాలి. ఇందుకోసం మీరంతా ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇస్తే.. పల్నాడులో 5వేల ఇళ్లు ఉన్నాయి అని గుర్తు చేశారు. జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ కింద ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది అని వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలోనూ NDA ప్రభుత్వం రావాలి’ అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news