ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ.. మరో 16 మంది పేర్లను వెల్లడించాల్సి ఉంది. లోక్‌సభ అభ్యర్థుల్లో ఒక్కరినీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రమే వారి పేర్లు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఎంపీ అభ్యర్ధుల తొలి జాబితా ఇలా ఉండే అవకాశం..
శ్రీకాకుళం – కె. రామ్మోహన్ నాయుడు
విశాఖ – ఎం. భరత్ అమలాపురం – గంటి హరీష్
విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయులు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి/ రాఘవరెడ్డి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్
అనంతపురం – బి.కె.పార్దసారధినంద్యాల – బైరెడ్డి శబరి