వైజాగ్ డ్రగ్స్ రాకెట్ లో టిడిపి నేతల హస్తం.. లోతుగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ..

-

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి నేతల డ్రగ్స్ బండారం బట్టబయలైంది.. విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసులో సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. పోర్ట్ లో పట్టుబడ్డ 25 వేల కేజీల కొకైన్ ,
మాదకద్రవ్యాల పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. ఇంటర్పోల్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్స్ ని సీజ్ చేసిన అధికారులు.. కంటైనర్ ఎవరి పేరు మీద వచ్చిందనే విషయాలను ఆరా తీయడంతో.. టిడిపి నేతల బండారం బయటపడింది..

తీగలాగితే డొంక కదిలినట్టు డ్రగ్స్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల పేర్లు బయట పడుతున్నాయి..
డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీతో టిడిపి నేతలకు సత్సంబంధాలు ఉన్నాయని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.. ఈ కంపెనీకి ఎండిగా ఉన్న వీరభద్రరావు చౌదరి, సీఈఓ గా ఉన్న కునం కోటయ్య చౌదరిలు నందమూరి, నారా కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.. ఈ డ్రగ్స్ స్కాం లో టిడిపి ముఖ్య నేతలకు నేరుగా లింకులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.. దామచర్ల సత్య, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, రాయిపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిబిఐ అధికారుల విచారణలో వెల్లడైందట.. దీంతో నారా లోకేష్ తో పాటు చంద్రబాబుకి ఈ స్కామ్ లో నేరుగా సంబంధం ఉండే అవకాశాలు ఉన్నాయని సిబిఐ అనుమానిస్తోంది..

సంధ్య ఆక్వా అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది.. లిక్కర్ స్కామ్ లో కూడా వీరభద్రరావు పాత్ర పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు విశాఖ కేంద్రంగా విమర్శలు చేస్తున్నారు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా డ్రగ్స్ మాఫియా అంటగడుతున్నారు.. ఈ క్రమములోనే బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విశాఖ కేంద్రంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వీరభద్రరావుది ప్రకాశం జిల్లా.. ఇతను దగ్గుపాటి పురందేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మరైన్లో పార్ట్నర్ గా ఉన్నారు.. ఇలా నారా, నందమూరి పురందేశ్వరి ఫ్యామిలీలకు నిందితులు అత్యంత సన్నిహితులనే అనుమానాన్ని సిబిఐ అధికారులు వ్యక్తపరుస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news