ఏపీ రైతులకు గుడ్‌ న్యూస్‌…ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు

-

ఏపీ రైతులకు గుడ్‌ న్యూస్‌…ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఏపీలో దండిగా ధాన్యం ఉందని.. నిండుగా నిధులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఖరీఫ్ ధాన్యం సేకరణ చెల్లింపులు వారంలో పూర్తి అవుతాయని ఏపీ సర్కార్‌ ప్రకటించింది. 61 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.830 కోట్లు జమ చేసినట్లు వివరించింది సర్కార్‌. 4.97లక్షల మంది రైతులకు రూ.6538 కోట్ల మద్దతు ధర అందించింది ఏపీ ప్రభుత్వం.

అటు ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. అంతేకాదు.. ఐదేళ్ల కింద ఇదే సమయంలో రైతులకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టినట్లు జగన్‌ సర్కార్‌ ఫైర్ అయింది. మద్దతు ధరను ఆలస్యం చేసి రూ.4వేల కోట్లు పక్కదారి పట్టించారని…చివరికి చంద్రబాబు దిగిపోతూ రూ.960 కోట్లు బకాయిలు పెట్టిన దుస్థితి ఉందన్నారు. సీఎం జగన్ వచ్చిన తర్వాతే అత్యంత పారదర్శకంగా రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర వస్తుందని చెబుతున్నారు రైతులు.

Read more RELATED
Recommended to you

Latest news