ఆ బస్సును సీబీఐ కి ఎందుకు అప్పగించలేదు : పట్టాభి

-

కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్ పోర్టు  కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. బస్సును పోలీసులు తనిఖీ చేసి ఆ కంపెనీ వాళ్లకే ఎందుకు అప్పజెప్పారని నిలదీశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు.

“సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసు. అందుకే హార్డిస్క్లు, రికార్డులన్నీ బస్సులో ఉంచారు. పోలీసులు వాటిని సీబీఐకి అప్పగించాల్సింది పోయి కంపెనీవాళ్లకే ఇస్తారా? ఇలా ఎందుకు చేశారో తెలియాలి. సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయడంలో ఆంతర్యమేంటి? పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే అంతా జరుగుతోంది. దర్యాప్తు సంస్థకు అడ్డుతగలాలని పోలీసులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా? బస్సులో దొరికిన డాక్యుమెంట్లను తిరిగి కంపెనీకి ఎందుకు ఇచ్చినట్లు? బస్సు. అందులోని వస్తువులను పోలీసులు సీబీఐకి అప్పగించలేదంటే ఏమనాలి? పెద్ద వ్యవహారం బయటపడ్డాకా ఇంత ఉదాసీనతా? ” అని ఆయన నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news