తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన నామినేటెడ్ పదవులు ఫేక్ అని తేలిపోయిందట. మార్చి 16న లోక్ సభ ఎలక్షన్ కోడ్ రావడంతో కాంగ్రెస్ నాయకులను బుజ్జగించడానికి జీవో కాపీలు లేకుండా హడావిడిగా అదే రోజు ప్రకటించిన నామినేటెడ్ చైర్మన్ పదవులు ఉత్తవే అని తేలిపోయిందని సమాచారం. కొన్ని పేరుమోసిన ప్రధాన పత్రికలు అయితే కనీసం విచారణ చేయకుండానే రెండు రోజుల ముందే మార్చ్ 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడ్డాయి అంటూ వార్తలు రాశాయి.
నామినేటెడ్ చైర్మన్ పదవులకు సంబంధించి లీకులు ఇచ్చారే తప్ప ప్రభుత్వం తరపున ఎలాంటి అధికారిక ప్రకటన కానీ ఉత్తర్వులు కానీ వెలువడలేదని సమాచారం. నామినేటెడ్ చైర్మన్ పదవులకు సంబంధించిన జీవో కాపీలు బయటపెట్టాలని వేసిన ఆర్టీఐలకు సమాధానం లేదని తెలుస్తోంది. మరోవైపు చైర్మన్ పదవులు ఇచ్చే ముందు మంత్రులకు సమాచారం ఇవ్వకుండా వ్యవహారం చేయడంతో వారంతా గుర్రుగా ఉన్నారట.