Nara Lokesh : తమాషాలు ఆడొద్దు…ఎన్ని సార్లు కారు ఆపుతారు అంటూ పోలీసులపై ఫైర్

-

ఎన్ని సార్లు కారు ఆపుతారు అంటూ పోలీసులపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు తన వాహనాన్ని పదేపదే ఆపుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ స్థానిక పోలీసు అధికారిని హెచ్చరించారు.

Nara Lokesh fired at the police saying how many times they stop the car

నా కాన్వాయ్ నాలుగు సార్లు పోలీసులు..తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే రోడ్డులో తిరిగే సీఎం, వైసిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వాహనాలు ఎందుకు తనిఖీ చేయడం లేదని మండిపడ్డారు. చట్టం అందరికీ సమానంగా అమలు చేయాలి కదా! నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్న పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news