రాజకీయాల్లో నేతలకు అసంతృప్తి అనే సబ్జెక్టు కామనే! ఈ విషయంలో నేతలకు పార్టీలతో సంబంధం లే దు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. తాము అనుకున్నది జరగకపోతే.. తీవ్ర అసంతృప్తి అనేది కామనే. అయితే,ఈ అసంతృప్తి అన్ని చోట్లా.. అందరికీ వర్కవుట్ అయ్యే పరిస్థితి ఉండదు. కొందరు మాత్రమే తమ అసంతృ ప్తిని బయటకు వెళ్లడించి కొరికలు నెరవేర్చుకుంటారు. ఇంకొందరు మాత్రం అసంతృప్తిని వెల్లడించినా.. సాధించేందుకు ఏమీ మిగలని పరిస్థితిలోనే ఉండిపోతారు. తాజాగా రాజకీయ సీనియర్ నేత, నెల్లూరు రాజకీయాలను తనదైన శైలిలో శాసించిన ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ క్రమం లోనే ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించారు. అయితే, ఇది చిక్కలేదు. పోనీ.. నామినేటెడ్ పదవి ని ఆశించారు. ఇది కూడా ఆయనను ఊరిస్తోందే తప్ప.. ఫలితం లేకుండా పోయింది. ఇవ్వనీ ఇలా తమ కనుసన్నల్లో నిర్వహించిన ఓ విద్యాసంస్థకు దూరం కావడం, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సహ కారం అందకపోగా.. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, తనను సెంటరాఫ్‌ది టాపిక్ చేసి.. రాజకీయాలు నడపడం వంటివి ఆనంను తీవ్ర అసహనానికి గురి చేశాయి.
ఈ క్రమంలోనే ఆనం తాజాగా తీవ్రమైన విమర్శలు చేశారు. నెల్లూరు మాఫియాలకు అడ్డాగా మారిందన్నారు ఆనం. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని.. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా నెల్లూరు వస్తే దొరుతుకుంది. అంతేకాదు, నెల్లూరు సిటీని ఆయన టార్గెట్ చేశారు. అయితే, వాస్తవానికి.. ఆనం చేసిన వ్యాఖ్యలు, వ్యక్తీకరించిన అసంతృప్తితో ఆయన సాధించేది ఏమైనా ఉందా? ఆయనకు ఏదైనా మంచి జరుగుతుందా? ఆయన కల సాకారం అవుతుందా? అంటే.. లేదనే చెప్పాలి.గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాక.. తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ముఖ్యంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని కూడా బాబు మాట నిలబెట్టుకోలేదని ఆయన అలిగారు.
అయితే, ఆయనను టీడీపీలో ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఎన్నికల్లో టికెట్ కూడా లభించే పరిస్థితి లేదని గ్రహించాక.. చివరి నిముషంలో వైసీపీలోకి చేరి అతి కష్టం మీద టికెట్ సంపాయించుకున్నారు. ఇప్పుడు సంస్థాగతంగా వైసీపీలో పుట్టి పెరిగిన నాయకులు అలిగితేనే పట్టించుకోని జగన్.. ఆనం వంటి వారు అలిగితే పట్టించుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన ఆగ్రహం.. ఆయనకే చేటు తెస్తుందని అంటున్నారు. మరి జగన్ ఎలా చూస్తారో చూడాలి.