వాషింగ్‌ మెషిన్‌లో నోట్ల కట్టలు.. షాకైన ఈడీ అధికారులు

-

క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు.. బోగస్‌ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట షెల్‌ కంపెనీల సాయంతో సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలతో రూ.1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి విశ్వసనీయ సమాచారం అందింది. ఈ క్రమంలో ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘన కేసులో క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతోపాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా, కురుక్షేత్ర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానం వచ్చిన అధికారులు వాషింగ్ మెషీన్ తెరిచి చూడగా అందులో పెద్ద మొత్తంలో నగదు ఉండటం చూసి షాకయ్యారు. వాషింగ్‌ మెషిన్‌లో దొరికిన నగదుకు సంబంధించిన ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. వివిధ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని వెల్లడించారు. అయితే, సోదాలు ఎప్పుడు జరిగాయి? ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news