ఆత్మకూరు నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు ఆనం. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రజా దర్భార్ భవనం కూల్చివేతతో వైసీపీ పాలన ప్రారంభమైందని విమర్శించారు.
ప్రకృతి విపత్తుల నుంచి నుండి కాపాడే సంగం కొండని మాయం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వైసీపి పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి ఆధీనంలో ఉన్నప్పటికీ వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆనం విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.