మళ్ళీ బీజేపీ కి అధికారం ఇస్తే దేశానికే ముప్పు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

దేశంలో మళ్ళీ బీజేపీ కి అధికారం ఇస్తే దేశానికే ముప్పు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఆశయ సాధనే జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి కాకా అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ స్వార్థ ఆర్థిక ప్రయోజనం కోసం ఎగువన లభించే నీళ్లను కిందకి తెచ్చాడన్నారు. మళ్ళీ పైకి ఎత్తి పోసే విధంగా 3 లిఫ్ట్ లతో చేసారని అన్నారు. 40 వేల కోట్లున్న కాలేశ్వరం ప్రాజెక్టును.. ప్రాజెక్టు 3 రేట్లు పెంచారన్నారు.

అంబేద్కర్ దూర దృష్టితో రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. కేసీఆర్ దోపిడీ అంతా మన కళ్ళ ముందు ఉన్న చరిత్ర అన్నారు. మూడు నెలల వ్యవధిలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. 1981 నుండి రాజకీయంలో ఉన్నాను. గెలుపు ఓటమి తేడా లేకుండా ప్రజా సేవలో ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ రాజకీయ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో అలోచించి వేయాలని తెలిపారు. బీజేపీ హయాంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ఓట్లు వేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news