టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇస్తే తప్పేముంది : సీఎం జగన్ 

-

టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇస్తే తప్పేముంది చంద్రబాబు అని ప్రశ్నించారు సీఎం జగన్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మేమంతాా సిద్దం సభలో మాట్లాడారు. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లిన చంద్రబాబు టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చాడని హేళన చేశాడు.  ఎం.ఏ. ఎకానమిక్స్ చదివి.. బీఈడీ పూర్తి చేసిన వీరాంజనేయులు.. చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగం దొరక్క లారీ డ్రైవర్ అయ్యాడు. చంద్రబాబు హయాంలో టిప్పర్ డ్రైవర్ అయితే.. మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులు ని సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు అని చెప్పాడు జగన్. 

మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు వీరాంజనేయులు. టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టలేదు.. డబ్బులు లేకపోయినా పర్వాలేదు.. పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని టికెట్ ఇచ్చాను. రాష్ట్రంలో 200 స్థానాలు ఉంటే.. 100 స్థానాలు పేదలకు ఇచ్చాం. పేదవాడికి అండగా ఉండే జగన్ కి.. పెత్తందారికి అండగా ఉండే   చంద్రబాబు కి ఉన్న తేడా గమనించాలని కోరాడు. అనంతపురం జిల్లాలో మరో అభ్యర్థి కూడా   ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు టికెట్ ఇచ్చాం.. రేపు చంద్రబాబు లక్కప్ప కి కూడా టికెట్ ఎందుకు ఇచ్చాడని ప్రశ్నిస్తాడు. పేదవాళ్లు ఎదగనివ్వాలని చెబుతున్నాను. జగన్ కి చంద్రబాబుకి తేడా గమనించమని కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news