ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు తిననన్ని తిట్లు కేసీఆర్ ఉద్యమ సమయంలో తిన్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాకుండా కుట్ర చేసిన వాళ్లకు కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. కేసీఆర్ పై ఎన్నో అసత్యాలు రాస్తున్నారు. కేసీఆర్ ను ఏం పీకలేరు. ఎవ్వడి అయ్యతోని ఏం కాదు.. కేసీఆర్ బయటికీ వచ్చారు. మిమ్మల్ని ఆటాడించే పని నిన్నటి నుంచి ప్రారంభం అయిందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు జగదీశ్ రెడ్డి.
తెలంగాణ ప్రజలు ప్రేమతో, దయతో పదేండ్లు బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగాన్ని తలపించింది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ దాకా మాట్లాడారు.