ప్రభాస్ సినిమాకు బ్రేకులు….కారణం ఏమిటంటే…..??

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ‘జాన్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే, తొలిసారిగా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్, గోపి కృష్ణ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక రెట్రో లవ్ స్టోరీగా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఇక సినిమా బ్యాక్ డ్రాప్ నిమిత్తం ఎక్కువ శాతం షూటింగ్ యూరోప్ లో చేయాలని మొదట భావించారట, అయితే అక్కడికి బోలెడు మంది యూనిట్ తో కలిసి వెళ్లి, చాలా రోజులు అక్కడే ఉండి షూటింగ్ చేయడం ఒకింత కష్ట సాధ్యం అని భావించిన దర్శక నిర్మాతలు, ఫైనల్ గా సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లోనే యూరోప్ లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల మాదిరి సెట్టింగ్స్ ని కొన్నాళ్ల క్రితం భారీ ఖర్చుతో నిర్మించారు. ఇక సెట్స్ రూపకల్పన కూడా ఇటీవల పూర్తి అవ్వడంతో ఈనెల మొదటి వారంలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలు పెడదాం అనుకున్నారట.

అయితే కారణాలు ఏమిటో తెలియరాలేదు గాని, అర్ధాంతరంగా ఆ షెడ్యూల్ కి బ్రేక్ పడిందని, దానిని బట్టి తదుపరి షెడ్యూల్ మొదలయ్యేది మళ్ళి జనవరి మొదటి వారంలోనే అని అంటున్నారు. ఇటీవల ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజు గారు కొంత అస్వస్థతకు గురవడంతో, మరికొద్దిరోజలు ఆయనతోనే గడపాలని ప్రభాస్ నిర్ణయించారని, అందుకే ఈ షెడ్యూల్ వాయిదా పడిందనే వార్త కూడా ప్రచారం అవుతోంది. కాగా ఈ వార్తలో పూర్తి  ఉంది. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే వచ్చే ఏడాది జూన్ ల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…….!!

Read more RELATED
Recommended to you

Latest news