నిన్న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వీక్షించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. 70 ఏళ్ల కేసీఆర్ ఎండల్లో తిరుగుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో బూతులు మాట్లాడుతున్నాడు. పెట్టుబడులు ఎలా తేవాలి..? ఆదాయం ఎలా సమకూర్చాలి అని ఆలోచించు అని కేటీఆర్ సూచించారు.
ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టాం. రైతుబంధు ఇవ్వొద్దని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపింది. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకినయ్. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు.