ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బిహార్ లో పర్యటించనున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అనంతరం నవాడాలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల సభ్యులు కూడా పాల్గొంటారు.
బిహార్లో వారం రోజుల వ్యవధిలో రెండో సారి ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంతకుముందు.. ఏప్రిల్ 4వ తేదీన జాముయి స్థానం నుంచి ఎన్డీఏ తరపున లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఇక, నవాడాలో ప్రధాని మోడీ కార్యక్రమం దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దశ లోక్సభ ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన గయా, ఔరంగాబాద్, జాముయితో పాటు నవాడా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ప్రధాని పర్యటనపై బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ ప్రాంతానికి అందించిన సౌకర్యాలు, ప్రగతికి చేసిన కృషి గురించి మోదీ ప్రజలకు వివరించనున్నారు.