IPL 2024 : విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై ట్రోల్స్.. సెహ్వాగ్ కౌంటర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంపై డాషింగ్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చారు. జట్టులో ఇతర బ్యాటర్లు చేతులెత్తేసినప్పుడు భారమంతా కోహ్లిపైనే పడిందన్నారు. అతని ఫామ్ పై ఎలాంటి అనుమానాలు లేవని.. చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. కోహ్లి ఇన్నింగ్స్ బాగుందని వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించారు.

కాగా, తన ఇన్నింగ్స్ పై విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. రాజస్థాన్తో మ్యాచ్లో దూకుడుగా ఆడలేకపోయానని.. ఆ విషయం తనకు తెలుసని కోహ్లి అన్నారు. ‘వికెట్ కాస్త ఫ్లాట్గా ఉండడంతో చివరి వరకు ఆడాలని భావించా అని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా పరిణతితో ఆడా అని అన్నారు. ఇక్కడ అంత ఈజీగా పరుగులు రాబట్టలేం. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో రన్స్ రాబట్టలేకపోయా అని అన్నారు. ఈ పిచ్ పై 183 రన్స్ నయమేననిపించింది’ అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news