రెండు రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నారు. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అయిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సమావేశాలు జరుగుతుండగానే ఆయన మధ్యలో నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లారు.
బీపీ రావడంతో అక్కడికి చేరుకున్న వైద్యులు పరీక్షించారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కోటంరెడ్డిని వైద్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.