మగాడు అయితే..పవన్ కళ్యాణ్ ఆ పని చేయాలి – ముద్రగడ

-

మగాడు అయితే..పవన్ కళ్యాణ్ ఆ పని చేయాలంటూ వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ మీడియాతో వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ…. పవన్ కళ్యాణ్ మగాడు అయితే డైరెక్ట్ గా నా మీద మాట్లాడాలి..పవన్ కళ్యాణ్ హైదరాబాదులో పుట్టాడని చురకలు అంటించారు.

Mudragada Padmanabham into janasena
Mudragada Padmanabham into janasena

ఆ తెలంగాణ రాష్ట్రం వేరు మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వేరంటూ సెటైర్లు పేల్చారు. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలని అనుకోవడం ఎంతవరకు సబబు అంటూ నిలదీశారు. హైదరాబాదులో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం కోపం పట్టుదల పవన్ కళ్యాణ్ కి ఏమయ్యాయని నిలదీశారు. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? పవన్ రెచ్చిపోతున్నాడని ఆగ్రహించారు వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం.

Read more RELATED
Recommended to you

Latest news