మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌..తక్కువ టైమ్‌లో ఎక్కువ వడ్డీ ఇచ్చే సెంట్రల్‌ స్కీమ్‌

-

మహిళలకు కేంద్ర ప్రభుత్వం వారికి ప్రోత్సాహం కల్పించే దిశగా, ఆర్థిక మద్దతు అందించే దిశగా ఎన్నో పథకాల్ని తీసుకొచ్చింది. వాటిల్లో సుకన్య సమృద్ధి యోజన బాగా క్లిక్‌ అయింది.. ఎంతో మంది ఈ పథకంలో చేరారు. అలాగే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే స్కీమ్‌ను కూడా కేంద్రం తీసుకొచ్చింది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు అన్ని వర్గాల వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్రం.. ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ మద్దతు ఉండటం వల్ల చాలా మంది వీటిల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ రేట్లు వస్తుండటం.. రిస్క్ లేకుండా రిటర్న్స్‌కు హామీ ఉండటం.. ప్రభుత్వ మద్దతు వంటివి కారణాలుగా ఈ పథకాలకు ఆదరణ పెరుగుతుంది.  ఇక ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా పోస్టాఫీస్ పథకాలు.. చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండటం కారణంగా విశేషాదరణ చూరగొన్నాయి.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ పథకంలో చేరాలనుకుంటే ఈ లోపే చేరాల్సి ఉంటుంది. ఎవరైనా మహిళ లేదా మైనర్ బాలికకు గార్డియన్‌గా మహిళా సమ్మాాన్ ఖాతా తెరవొచ్చు. ఈ స్కీం కింద కనీసం రూ. 1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక ఇది ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసే పథకం.
మహిళా సమ్మాన్ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 2 సంవత్సరాలు. అంటే రెండేళ్ల తర్వాత ఈ స్కీం నుంచి మీరు పెట్టిన నగదును వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు.
ఇక మహిళా సమ్మాన్ పథకంలో స్థిర వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు రూ .2 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి.. రెండేళ్ల తర్వాత అంటే 2025, అక్టోబర్‌లో మీ చేతికి వడ్డీతో కలిపి రూ. 2.32 లక్షలు చేతికి వస్తాయి. ఇందులో రూ. 1000 నుంచి రూ. 2 లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. అది మాత్రం 100 మల్టిపుల్స్‌తో నగదు ఉండాలి. మధ్యలో నగదు ఉపసంహరించుకునేందుకు ఉండదు. ఏడాది తర్వాత కనీసం 40 శాతం నగదు తీసుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అకౌంట్ మధ్యలోనే ఉపసంహరించుకునే వీలు ఉండదని గుర్తుంచుకోవాలి. ఈ స్కీంలో ఎప్పుడే చేరినా రెండేళ్లలో మెచ్యూరిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news