మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ దేవర. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్లో కనిపించనున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ హక్కులు దక్కించుకున్నారు.
2015లో కరణ్ జోహార్.. బాహుబలి హిందీ వెర్షన్‌ను తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేశారు . ఆ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడంతో.. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడంతో దేవర సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను కూడా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో పాటు AA ఫిల్మ్స్ కూడా దక్కించుకుంది. ఈ సినిమా నార్త్ ఇండియా థియేటర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పార్టనర్ షిప్ అనౌన్స్ చేస్తున్నందుకు, ఒక మంచి సినిమా అనుభవాన్ని అందరికి ఇవ్వగలుగుతున్నందుకు చాలా గర్వంగా ఉందంటూ కరణ్ జోహార్ అన్నారు.