పోరాటం చేసింది మేమని కెసిఆర్ సర్కార్‌ని కూల్చితే కాంగ్రెస్ నేతలు అధికారం అనుభవిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు.
నాలుగు నెలల పాలన చూశాక కాంగ్రెస్ కి ఓటు వేసిన ప్రజలు బాధపడుతున్నారని అన్నారు కెసిఆర్ కేటీఆర్ లతో ఓ కాంగ్రెస్ నేతలకి దోస్తీ ఉందని చెప్పారు ఢిల్లీకి పంపడానికి డబ్బులు ఉన్నాయి కానీ రైతులకు బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని అడిగారు ప్రస్తుతం బండి సంజయ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.