తెలంగాణ రైతులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్

-

తెలంగాణ రైతులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రైతుదీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వండి సూచించారు.

రైతులు ఇబ్బందుల పరిష్కారం కోసం 9904119119 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న కిసాన్ సమ్మాన్ నిధులు జమలో ఏమైనా పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కకడ ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news