రేపే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

-

రేపే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 13న జరగనున్న ఎన్నికలకు.. తెలంగాణలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ (ఉపఎన్నిక) స్థానంలో.. ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

Tomorrow the process of nominations will start in Telugu states

26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలోనే.. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ తేదీ ఖరారు అయింది. 22న వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫున మొదటి సెట్టు నామినేషన్ ను దాఖలు చేయనున్నారు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి …ఈనెల 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకొని కడపకు రానున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news