గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సిని ప్రచయిత గొల్లపూడి మారుతి రావు తుది శ్వాస విదించారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితం మరణించారు. 1939 ఏప్రిల్ 14 న జన్మించిన మారుతి రావు… దాదాపు 230 సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా… సిని రచయితగా, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మారుతి రావు పలు విభాగాల్లో ఆరు సార్లు నంది పురస్కారాలను గెలుచుకున్నారు. కామెడి పాత్రలలో కూడా ఆయన యిట్టె ఒదిగిపోయే వారు.
విజయనగరంలో జన్మించిన మారుతి రావు… పలు టీవీ కార్యక్రమాల ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన శ్రీకాళహస్తి పైప్స్ కి చైర్మన్ గా కూడా ఉన్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆయన మ్యాథమేటికల్ భౌతిక శాస్త్రములో బి.యస్సీ (ఆనర్స్) చేశారు. మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. 1992 ఆగస్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో ఒక ప్రమాదంలో మరణించగా… ఆయన జ్ఞాపకార్ధం… గొల్లపూడి శ్రీనివాస్ పేరుతో జాతీయ పురస్కారాలను కూడా ఇచ్చే వారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా సిని రంగంలోకి మారుతి రావు ప్రవేశించారు.