దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్ట్ కీల‌క నిర్ణ‌యం..

-

దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై హైకోర్ట్ నేడు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆదేశించారు. ఈ మేరకు సుప్రీం మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ ఉన్నారు. అదే విధంగా, ఆరు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ కమిషన్‌కు స్పష్టం చేసింది.

వీరికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిషన్ చేపట్టబోయే విచారణ వివరాలను మీడియాకు లీక్ కాకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మ‌రియు దిశ ఎన్‌కౌంటర్‌పై అన్నికోర్టులలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్టే విధించింది. త్రిసభ్య కమిషన్ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news