విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఏకంగా 5 కోట్లు విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెజవాడలో మెడికల్ గోడౌన్ లో మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి.
సుమారు రెండు గంటల పాటు 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది ఫైర్ సిబ్బంది. అయితే.. ఈ మెడికల్ గోడౌన్ కు అనుమతి ఉందా లేదా అని పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు. అటు ఎంత మేర నష్టం జరిగింది అంచనా వేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.