వివేకానందరెడ్డి కేసులో సంచలన తీర్పు… ఎక్కడా మాట్లాడొద్దంటూ కడప కోర్ట్ సూచన

-

2019 ఎన్నికల సమయంలో జరిగిన మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో నిజాలు ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఇది ఏపీలో ఎన్నికల అంశంగా మారిపోయింది.గడిచిన ఐదేళ్లుగా ఈ విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.అధికారంలో ఉన్న వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాల తీరుపై కడప హైకోర్టు మండిపడింది. దీనిపై మాట్లాడకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు స్పష్టమైన అదేశాలిస్తూ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని న్యాయస్థానం ప్రతిపక్ష నేతలను హెచ్చరించింది.

ఏపీలో ముఖ్యంగా కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ఉన్న వివేకా హత్య కేసు విషయంలో సంచలన నిర్ణయం వెలువరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకా హత్య కేసు గురించి ప్రచారంలో ప్రస్తావించవద్దని.. కడప కోర్టు ఆదేశించింది. తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా రాజకీయ నేతలు పదే పదే వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని.. తద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టుకు వెళ్లారు.దీనిపై వేగంగా స్పందించిన కోర్టు పైవిధంగా తీర్పుని వెలువరించింది.

కడప హైకోర్టు తాజా నిర్ణయoపై ప్రతిపక్షాలు ఇంకా స్పంసించలేదు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్, వైఎస్ సునీత తదితరులకు వివేకా హత్య గురించి మాట్లాడవద్దని కోర్టు తేల్చి చెప్పేసింది. మొత్తానికి వివేకా హత్య కేసును ఆయుధంగా చేసుకుని ఓట్లు రాబట్టలనుకున్న ప్రతిపక్షాల ఆటలకు కోర్టు అడ్డుకట్ట వేసింది న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Latest news