BREAKING: వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్య చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురయ్యాడు. అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ (40) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో తల పై మోడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు వైసీపీ ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ.
గ్రామంలో కొందరు వ్యక్తులతో జరిగిన గొడవలో వారు బండరాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కన్నాయిగూడెం గ్రామశివార్లలో మృతదేహం వెలుగు చూసింది. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎటపాక పోలీసులు. వైసీపీ ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ హత్యపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.