అసలు ఎన్నార్సి అంటే ఏంటి…? దానిని భారతీయులు ఎందుకు సమర్ధించాలి…?

-

బిజెపి ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ విభజన చేసి అక్కడ ఏళ్ళ తరబడి ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ సర్కార్. ఇక ఇప్పుడు ఎన్నార్సీ అంటూ కొత్త విధానం మీద దృష్టి పెట్టింది. దేశంలో ఉన్న అక్రమ చొరబాటు దారులను పంపడానికి గాను కేంద్రం ఎన్నార్సి విషయంలో సీరియస్ గా ఉంది. హిందు ఓట్ల కోసమే అనే ఆరోపణలు వస్తున్నా సరే బిజెపి వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో అసలు ఎన్నార్సి అంటే ఏంటి…? అనేది చూద్దాం.

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అనేది అస్సాం రాష్ట్రంలోని భారతీయ పౌరులను గుర్తించడానికి పేర్లు మరియు కొన్ని సంబంధిత సమాచారాన్ని కలిగి ఉన్న భారత ప్రభుత్వం నిర్వహించే రిజిస్టర్. ఈ రిజిస్టర్ ప్రారంభంలో, ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రం కోసం తయారు చేయబడింది. అయితే, నవంబర్ 20, 2019 న, హోంమంత్రి మిస్టర్ అమిత్ షా పార్లమెంటరీ సమావేశంలో దీనిని మొత్తం దేశానికి విస్తరిస్తామని ప్రకటించారు. 1951 భారత జనాభా లెక్కల తరువాత ఈ రిజిస్టర్ మొదట తయారు చేయబడింది మరియు అప్పటి నుండి ఇది మార్పులకు నోచుకోలేదు.

భారత పౌరసత్వ చట్టం, 1955 లో చేసిన సవరణ కారణంగా, అస్సాం రాష్ట్రానికి చెందిన పౌరుల రాష్ట్ర రిజిస్టర్, ఇది జాతీయ పౌరుల రిజిస్టర్‌లో భాగంగా ఉంది. అసలు దీనిని భారతీయులు ఎందుకు సమర్ధించాలి అనే ప్రశ్న వినపడుతుంది. దానికోసం ఎక్కువగా చెప్పుకోకపోయినా సరే… దేశంలో కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్ సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున చొరబాట్లు ఎక్కువయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు వీరు వరంగా మారిపోయారు. వాళ్లకు… ఓటు హక్కు కల్పించడంతో ఆ పార్టీలకు వారు మద్దతు ఇస్తున్నారు.

ఇక వీరిలో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు, దోపిడీ దారులు, రోహింగ్యా లాంటి ప్రమాదకర వ్యక్తులు దేశంలోకి చొరబడుతున్నారు. ఇక వీరు దేశంలో అలజడి కి కూడా కారణంగా మారుతున్నారు. విధ్వంశాల్లో వీళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా బెంగాల్ సరిహద్దుల నుంచి బంగ్లాదేశీయులు ఎక్కువగా దేశంలో చొరబడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చొరబాట్లు ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా… దేశ అస్తిత్వం కోసమే తాము ఈ బిల్లు తీసుకొస్తున్నామని దేశం మొత్తం అమలు చేస్తామని బిజెపి అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news