కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ బయటకు వస్తే మా అస్త్రాలు మేము బయటకు తీస్తామని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తమ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏం చేయలేడు అని విమర్శించారు. బీఆర్ఎస్ లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అలా కాదని.. అందరూ లీడర్లే అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని.. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ చేసిన ఆరోపణలన్నింటికీ ఆగష్టులో సమాధానం చెబుతా అని ప్రకటించారు. ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో ట్యాబ్ లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. 14 పైగా సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. రాబోయే పదేళ్ల వరకు కాంగ్రెస్ ని ఎవరూ టచ్ చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు.