మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్  ఇప్పటికే రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇక ఇటీవల తెలుగులో కూడా రిలీజైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.  చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

మే 03 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఏప్రిల్ 05న తెలుగులో కూడా విడుదల అయింది. ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది. థియేటర్ లో వీక్షించని వాళ్లు మే 03 నుంచి ఓటీటీలో వీక్షించండి.

Read more RELATED
Recommended to you

Latest news