తెలంగాణకు 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా మేఘావృతంగా మారింది వాతావరణం. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
అంతేకాదు… నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అయితే… భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.